సెంచరీలతో మెరిసిన హెడ్-స్మిత్🔥… SCGలో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం
Australia vs England Ashes Test 2025 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఐదో యాషెస్ టెస్టు మూడో రోజు ముగిసే సరికి ఆస్ట్రేలియా మ్యాచ్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ చేసిన 384 పరుగులకు ప్రతిగా ఆస్ట్రేలియా 518/7తో నిలిచి, 134 పరుగుల లీడ్ సాధించింది. స్కోర్‌బోర్డ్ మాత్రమే కాదు, ఆట తీరూ చూస్తే – ఇక్కడి నుంచి మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల నుంచి జారిపోవడం చాలా కష్టం అన్న భావన…